తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ (బీఎంఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన మరాఠీ కృష్ణమూర్తిని గజ్వేల్లోని వారి నివాసంలో పలువురు నాయకులు కలిసి ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేయాలని సూచించారు.
బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్, ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ నిరంతరం పోరాడాలని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో బీఎంఎస్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. నూతన రాష్ట్ర కమిటీ కార్మికుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సన్మానం అనంతరం జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, సంఘ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కప్పర ప్రసాదరావు మరాఠీ కృష్ణమూర్తికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి తూర్పుంటి శీను, జిల్లా ఉపాధ్యక్షులు బాలు భూపతి రాజు, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు గుడాల శేఖర్, ప్రధాన కార్యదర్శి ఎల్లంరాజు, రాష్ట్ర నాయకులు సిద్ధల రవి, బైరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.











