కష్టపడే కార్యకర్తలను, యువతను, మహిళలను గుర్తించి వారికి తగిన పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు.
మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో బండి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలు అధిక సంఖ్యలో పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి, వారి సేవలను పార్టీ వినియోగించుకోవడంతోపాటు వారికి తగిన రీతిలో పదవులు ఇవ్వడం జరుగుతుందని బండి రమేష్ హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజల కోసం పనిచేయడం, వారితో మమేకమవ్వడం, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం వంటి పనుల ద్వారా పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని, అలాంటి వారినే పార్టీ గుర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కష్టపడే వారిపై విమర్శలు రావడం సహజమని, అలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు. యువతను గుర్తించి వారికి తగిన అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి మోయిజ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ భవ్య, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రమ్య యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు బొమ్మక అజయ్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఇంచార్జులు రామ్ రెడ్డి, హరి ప్రసాద్, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ హరి, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ సల్మాన్, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సలీం, మరియు జిల్లా స్థాయి నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.











