నిజామాబాద్, జూలై 22
ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ నాయకుల బైఠాయింపునకు నిరసనగా గాంధీభవన్‌ను ముట్టడించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ నాయకులు చేపట్టిన బైఠాయింపునకు నిరసనగా గాంధీభవన్‌ను ముట్టడించేందుకు బీజేపీ బుధవారం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు.
పార్టీ నాయకులను అదుపులోకి తీసుకోవడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.











