సారాంశం
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో విధుల్లో ఉన్న బీఎల్ఓ అధికారిపై దురుసుగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోటో లేని ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడంతో పాటు, అసభ్య పదజాలంతో దూషించి, అధికారిక కిట్‌ను లాక్కొనే ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముఖ్య విషయాలు
- 1ఫోటో లేని ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడంతో పాటు, అసభ్య పదజాలంతో దూషించి, అధికారిక కిట్‌ను లాక్కొనే ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
- 2రామేశ్పల్లి గ్రామానికి చెందిన బీఎల్ఓ అధికారి శ్రీమతి ఠాకూర్ అనిత శుక్రవారం లిమ్రా ఫంక్షన్ హాల్ సమీపంలో ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ విధులు నిర్వహిస్తున్నారు.
- 3ఈ సందర్భంగా ఉజ్మా బేగం ఫోటో జతచేయని ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించగా, నిబంధనల ప్రకారం ఫోటో లేకుండా ఫారాన్ని స్వీకరించలేమని బీఎల్ఓ స్పష్టం చేశారు.
- 4ఈ క్రమంలో ఉజ్మా బేగం తాను బంగ్లాదేశ్‌కు చెందినదానినని చెప్పడంతో, నిబంధనల మేరకు ఫారాన్ని తీసుకోవడానికి బీఎల్ఓ నిరాకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫోటో లేని ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడంతో పాటు, అసభ్య పదజాలంతో దూషించి, అధికారిక కిట్‌ను లాక్కొనే ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రామేశ్పల్లి గ్రామానికి చెందిన బీఎల్ఓ అధికారి శ్రీమతి ఠాకూర్ అనిత శుక్రవారం లిమ్రా ఫంక్షన్ హాల్ సమీపంలో ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఉజ్మా బేగం ఫోటో జతచేయని ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించగా, నిబంధనల ప్రకారం ఫోటో లేకుండా ఫారాన్ని స్వీకరించలేమని బీఎల్ఓ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఉజ్మా బేగం తాను బంగ్లాదేశ్‌కు చెందినదానినని చెప్పడంతో, నిబంధనల మేరకు ఫారాన్ని తీసుకోవడానికి బీఎల్ఓ నిరాకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.