నిజామాబాద్, 2026-07-10
నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత, సామాజిక కార్యకర్త, మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మీసాల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్లోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీసాల శ్రీనివావాసరావుతో తనకు దాదాపు 20 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత, సామాజిక కార్యకర్త, మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మీసాల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్లోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీసాల శ్రీనివావాసరావుతో తనకు దాదాపు 20 ఏళ్ల అనుబంధం ఉందని, మీసాల ఫౌండేషన్ ద్వారా ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
మీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల పార్టీ నిబద్ధత, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతోనే పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ జనసేనను ప్రజల్లో మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.












