భారతీయ జనతా పార్టీ భావజాలంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.
నగరంలోని బోర్గాంలో శుక్రవారం ముగిసిన బీజేపీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శిక్షణా తరగతుల అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు లేని సమయంలో కూడా పార్టీ కార్యకలాపాలు సమాజంలో నిరంతరంగా కొనసాగాలని ఆయన సూచించారు.
పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న అన్ని సంస్థలతో సమన్వయం పెంపొందించుకోవాలని, వేర్వేరు రంగాల్లో పనిచేసినా దేశాభివృద్ధి, సమాజ సేవ లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగిందని, కేంద్ర పథకాలు గ్రామస్థాయి వరకు చేరుతున్నాయని ఆయన అన్నారు.
ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి, కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్‌ను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఘనంగా సన్మానించారు.








