ప్రజా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందని, దీనితో ఇకపై రాజధానిని ఎవరూ మార్చలేరని ఎంపీ సి.ఎం.రమేష్ అన్నారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుతో దానిని ఎవరూ కదిలించలేరని ఎంపీ రమేష్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ప్రక్రియలో సహకరించారని ఆయన తెలిపారు.
రాజధాని అంశంపై అనవసర రాజకీయాలు చేసేవారికి ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుందని, పులివెందుల ఎమ్మెల్యే వంటి వారు ఇకపై ఊసరవెల్లిలా రంగులు మార్చలేరని ఎంపీ రమేష్ వ్యాఖ్యానించారు.
ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అమరావతి అని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.
ఈ బిల్లుతో అమరావతికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఎంపీ రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.











