భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబును షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కలిసి, ఏజెన్సీ ప్రాంత ఎస్సీల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని వినతి పత్రం అందించారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినా సరైన స్పందన లభించడం లేదని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లినప్పుడు ఆయన స్పందించి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కోసం తమ సంస్థ పనిచేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఎదురుచూస్తున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు దామాషా ప్రకారం ఉండేవి. అయితే, గత ప్రభుత్వం ఎస్సీ కులాలను జనరల్ లో కలిపి, వారికి ప్రాతినిధ్యం లేకుండా చేసిందని విమర్శించారు.
ఎస్సీ రైతులు మాన్యువల్ కహానీల ద్వారా పంట రుణాలు పొందే అవకాశాన్ని కోల్పోయారని, తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు మాన్యువల్ ఫహానిల ద్వారా పంట రుణాలు ఇప్పించి ఆదుకోవాలని శ్రీనివాస్ కోరారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.










