వసంతనగర్ డివిజన్లోని గోపాలనగర్ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సరఫరా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నాయకులు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ, గోపాలనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి సుధీర్, కిషన్‌రావు తదితరులు హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ (జీఎం), ఎస్ఓలను, డిప్యూటీ జనరల్ మేనేజర్ ను కలిసి ఈ సమస్యపై వినతిపత్రం అందజేశారు.
గోపాలనగర్ ప్రాంతంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు అధికారులకు వివరించారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
నాయకుల వినతికి స్పందించిన జీఎం, ఎస్ఓ, డిప్యూటీ జనరల్ మేనేజర్ త్రినాధరావు, సమస్యను పరిశీలించేందుకు ఎల్లుండి ఉదయం కాలనీలో ఇన్స్పెక్షన్ నిర్వహిస్తామని తెలిపారు. హై ప్రెజర్‌తో తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాలనీ ప్రజలందరూ ఇన్స్పెక్షన్ సమయంలో అందుబాటులో ఉండాలని యువ నాయకులు కోరారు. ఈ విషయంలో మార్గనిర్దేశం చేసిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్‌కు నాయకులు, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.











