సదాశివనగర్ మండలంలోని ఉత్నూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయించారు. సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి 200 మంది గ్రామస్తులను తన సొంత ఖర్చులతో తీసుకెళ్లారు.
గ్రామ ప్రజల మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికైనందుకు కృతజ్ఞతగా, స్వామి దర్శనం చేయలేని వారికి ఈ అవకాశాన్ని కల్పించినట్లు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ యాత్రలో దాదాపు 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఎలాంటి వాగ్దానం లేకుండానే ఈ విధంగా ఆధ్యాత్మిక యాత్రను ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామస్తులు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












