జిల్లా ప్రజలందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు జిల్లా పాలనాధికారి శ్రీ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. తెలుగు నూతన సంవత్సరానికి ఆరంభ సూచికగా నిలిచే ఈ పర్వదినం, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశిష్టమైన వేడుక అని ఆయన పేర్కొన్నారు.
జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఉగాది పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యుగాది తెలుగు నూతన సంవత్సరానికి ఆరంభ సూచికగా నిలిచే పర్వదినమని, ఇది మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశిష్టమైన వేడుక అని ఆయన తెలిపారు.
ఈ శుభ సందర్భంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో నిండిపోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ పరస్పర స్నేహభావంతో, ఐకమత్యంతో జీవిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
కొత్త సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ యుగాది పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, అవకాశాలు, విజయాలను తీసుకురావాలని జిల్లా పాలనాధికారి ఆకాంక్షించారు.
జిల్లా యంత్రాంగం తరపున ఈ శుభాకాంక్షలు తెలియజేయబడ్డాయి.












