తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమ డిపోలు, విలువైన స్థలాలను ప్రైవేటు బస్సులకు అప్పగించడాన్ని నిరసిస్తూ, ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.
ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రిక్ బస్సుల డిపోల ముందు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి వెల్లడించారు.
ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఇది ఆర్టీసీ భవిష్యత్తుకు ముప్పు తెస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రైవేటు బస్సులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు కల్పించబోమని వారు స్పష్టం చేశారు.
ఈ నిరసనల ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు.







