సత్యనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 2026-28 సంవత్సర కాలానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. రిటైర్డ్ ఉపాధ్యాయులు జి. మధుసూదన్ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
నాగారం, మార్చి 22: సత్యనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ (Regd-1389/2014) 2026-28 సంవత్సర కాలానికి గాను నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. రిటైర్డ్ ఉపాధ్యాయులు జి. మధుసూదన్ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించి, ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.
కాలనీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులుగా గుండ రంగారెడ్డి, గౌరవ అధ్యక్షులుగా బి. రెడ్యా నాయక్, ప్రధాన కార్యదర్శిగా కాకర్ల నాగరాజు, కోశాధికారిగా ఎం.డి. గౌస్ మియా, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, పుండరీకం నవీన రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా అలివేణి, విశ్వనాథ్, రవికాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా హంస, సాయికుమార్ గౌడ్, కావేరి, కార్యనిర్వహక సభ్యులుగా చిరంజీవి, ఉపేందర్ రెడ్డి, మానస ఎన్నికయ్యారు.
ముఖ్య సలహాదారులుగా ఎల్లయ్య, మధుసూదన్ రెడ్డి, సివిల్ టెక్ మధు, లక్కీ శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ నాయక్ నియమితులయ్యారు. నూతన అధ్యక్షులు గుండ రంగారెడ్డి మాట్లాడుతూ, కాలనీలోని మౌలిక వసతుల కల్పన మరియు కాలనీవాసుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఇతర కాలనీల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.











