శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలోని రామాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం సందర్శించి, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతాపరమైన చర్యలను సమీక్షించారు.
ఓల్డ్ బస్ స్టేషన్ వద్ద గల రామాలయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, తాగునీరు, పార్కింగ్, క్యూ లైన్ల వంటి సౌకర్యాలపై ఎస్పీ ఆరా తీశారు. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని రామాలయాలలో భక్తుల భద్రత కోసం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంటుందని, పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణలో ఉంటారని హామీ ఇచ్చారు.
భక్తులు పోలీసులకు సహకరించి, క్రమశిక్షణతో పండుగను జరుపుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.








