రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజ రంజన్ హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న నేపాలీ పనిమనిషి కల్పన అలియాస్ ధర్మ (30)ను మహారాష్ట్రలోని పుణెలో అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ హత్య కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితుల విచారణలో కల్పన పుణెలో ఉన్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా, ప్రత్యేక పోలీసు బృందాలు పుణె వెళ్లి కల్పనను పట్టుకున్నాయి.
అరెస్ట్ అయిన కల్పనను ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. ఆమెను విచారించడం ద్వారా హత్యకు గల కారణాలు, నేరంలో ఆమె పాత్ర వంటి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. అరెస్ట్ తో కేసు పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు.











