పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ముస్లిం సోదరులు, పోలీస్ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, రంజాన్ పండుగ క్రమశిక్షణకు, త్యాగానికి నిదర్శనమని తెలిపారు. మత భేదాలు లేకుండా ఐక్యమత్యంతో జీవించడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించవచ్చని సూచించారు.
ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలను విరమించే సమయంలో వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషకరమని ఆయన అన్నారు. పండుగల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. ప్రార్థనల అనంతరం ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎస్హెచ్ఓ నరహరి, ఎస్ఐలు, ముస్లిం సోదరులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో అందరూ కలిసి సోదరభావంతో పాల్గొన్నారు.












