గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి భాగ్యనగర్ జిల్లా బీజేపీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీ మోదీ రాష్ట్రానికి వస్తున్న తొలి పర్యటన కావడంతో ఈ సభకు ప్రాధాన్యత పెరిగింది.
సన్నాహక సమావేశంలో, సభ విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
తెలంగాణ ప్రజలు ఈ చారిత్రాత్మక బహిరంగ సభకు భారీగా హాజరై, దానిని విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది.
ఈ పర్యటన రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.











