బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గౌరవనీయ POCSO కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు బుధవారం (28.04.2026) వెలువడింది.
2021 ఆగస్టు 12న జరిగిన ఈ ఘటనలో, నిందితుడు మిఠాయిలు, బెలూన్లు ఇస్తానని ఆశచూపి బాలికను ఖాళీ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు దర్యాప్తు అనంతరం, నిందితుడిపై POCSO చట్టం మరియు IPC కింద అభియోగాలు మోపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం, నిందితుడు నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.
కోర్టు తీర్పు ప్రకారం, నిందితుడికి POCSO చట్టం సెక్షన్–6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000/- జరిమానా విధించారు. అదనంగా, IPC సెక్షన్–366 కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.2,000/- జరిమానా కూడా విధించారు. ఈ రెండు ప్రధాన శిక్షలు ఏకకాలంలో అమలులో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు దర్యాప్తును DSP శ్రీ U. నాగరాజు పర్యవేక్షించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా శ్రీ D. చంద్రశేఖర్ వ్యవహరించారు.











