మంజీరా ఎత్తిపోతల పథకం కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియపై ఆర్&ఆర్ కమిటీ సమీక్ష నిర్వహించింది.
బుధవారం జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, కమిటీ సభ్యులు పిట్లం మండలంలోని నాగంపల్లి, పెద్ద అన్నారం గ్రామాల్లో భూసేకరణ అంశాలను పరిశీలించారు.
భూసేకరణ ప్రక్రియలో అత్యల్ప విస్తీర్ణంలో భూములను సేకరిస్తుండటంతో ఎటువంటి నివాస గృహాల నిర్వాసనం జరగడం లేదని కమిటీ తెలిపింది.
స్థానిక కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం ఉండదని అభిప్రాయపడిన కమిటీ, RFCTLARR Act, 2013 ప్రకారం పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు వర్తించవని పేర్కొంది.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, బాన్సువాడ ఆర్డీవో, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీపీవో, పిట్లం తహసీల్దార్, ఎస్బీఐ పిట్లం శాఖ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.







