లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ, 2026-27 లయనిస్టిక్ సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడు పి. రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి.
డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ నాయికోటి రామప్ప నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ పి.రాములు గౌడ్, యస్.విజయేందర్ రెడ్డి, డి.హన్మంత్ గౌడ్, అనంత్ రావ్ కులకర్ణి, యం.వెంకటేశం తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత సంవత్సరం క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమాల సమీక్షతో పాటు, రాబోయే సంవత్సరానికి కార్యాచరణపై చర్చలు జరిగాయి.
నూతన కమిటీలో అధ్యక్షుడిగా లయన్ శంకరి విజయేందర్ రెడ్డి, కార్యదర్శిగా పిల్లిగుండ్ల రాములుగౌడ్, కోశాధికారిగా అనంత్ రావ్ కులకర్ణి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గుండు అనంతయ్య, ఎల్‌సీఐఎఫ్ చైర్మన్‌గా పర్యాద రామకృష్ణారెడ్డి, సభ్యత్వ కమిటీ చైర్మన్‌గా చేవూరి రజనీకాంత్, సేవా కమిటీ చైర్మన్‌గా రుద్రారం కిరణ్ గౌడ్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా నాయికోటి రామప్ప, క్లబ్ అడ్మినిస్ట్రేటర్‌గా రఘుపతి ప్రభాకర్ రెడ్డిలు బాధ్యతలు స్వీకరించారు.
క్లబ్ డైరెక్టర్లుగా డి.హన్మంత్ గౌడ్, యం. సునీల్ కుమార్, జార్జ్ మ్యాత్యూ, ఎం.రాంగోపాల్, డా.జి.శ్రీహరి ఎంపికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులు "అందరం కలిసి సేవ" అనే నినాదంతో సమాజానికి అవసరమైన విద్య, వైద్య, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడతామని, డిస్ట్రిక్ట్ 320డి పరిధిలో క్లబ్‌కు మంచి గుర్తింపు తీసుకు వస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు జి.మాణిక్ రావ్, యస్. వెంకటేశ్వర్ రావ్, డి.రాంచందర్, యం. శ్రీనివాస్ రెడ్డి, ఏ.లక్ష్మారెడ్డి, బి.శ్రీనివాస్, పి.బస్వరాజ్, జి. భరతయ్య, పి.శ్రీనివాస్ గౌడ్, వి.వెంకటేశ్వర్ రెడ్డి, టి.సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








