గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆగం అఖిల, ఆరుట్ల పద్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు గృహ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఈ గృహనిర్మాణ పథకం అమలు జరుగుతోందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు విజయ్ కుమార్, ఆగం రాజు, నీరుడి నర్సింలు, వార్డు సభ్యులు ఆగం మల్లేష్ పాల్గొన్నారు. నాయకులు చాకలి చంద్రయ్య, మల్లేష్ గౌడ్, మన్నే రాజేశ్వర్, కోకొండ రాములు, లబ్ధిదారులు ఆగం అఖిల, ఆరుట్ల పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












