కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొలను హనుమంత రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం బాచుపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్థానిక నాయకులతో కలిసి బండి రమేష్, కొలను హనుమంత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి, పరస్పరం తినిపించుకున్నారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేయాలని, తద్వారా పార్టీలో ఉన్నత స్థానాలను అధిష్టించాలని కొలను హనుమంత రెడ్డికి సూచించారు.
ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, లక్ష్మి శివా చౌదరి, హరి ప్రసాద్ నాయుడు వంటి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరూ కలిసి హనుమంత రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.







