నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆదివారం మరోసారి వాయిదా పడింది. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వాగ్వాదానికి దిగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
శనివారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
అధికారులు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక పేరును పిలవగా, ఆమెకు మద్దతుగా ఏడుగురు కౌన్సిలర్లు చేతులెత్తారు. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నం సత్యం పేరును ముందుగా పిలవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తూ కార్యాలయంలో బైఠాయించి నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మె...











