కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన వ్యక్తిగత నిధులతో 4 కోట్ల రూపాయల విలువైన డెస్క్, టేబుల్స్ ను సమకూర్చారు.
ఈ విరాళం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకూ అవసరమైన ఫర్నిచర్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజాగా, అడ్లూరు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మరియు డైవర్స్ కాలనీలోని ఉర్దూ భవన స్కూల్ కు 20 డెస్క్, టేబుల్స్ ను అందజేశారు.
ఈ సందర్భంగా, అడ్లూరు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు శాసనసభ్యుడికి తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యసన ప్రక్రియ మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.












