కామారెడ్డి జిల్లాలో వివిధ శాఖల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌కు పూల మొక్కలను అందజేశారు.
జిల్లాలో డీబీసీడీఓ (DBCDO)గా బాధ్యతలు స్వీకరించిన పి. నర్సయ్య, జిల్లా విద్యాశాఖ అధికారిగా (డీఈఓ) బాధ్యతలు చేపట్టిన ఎల్. మల్లిఖార్జున్ కలెక్టర్‌ను కలిసి తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నూతన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని నూతన అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు తోడ్పడాలని కలెక్టర్ నూతన అధికారులను కోరారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.











