కామారెడ్డి జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'Arrive Alive' రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు శనివారం ముగిశాయి. ఈ కార్యక్రమం ద్వారా రహదారి భద్రతపై డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన కల్పించారు.
ఏప్రిల్ 13 నుంచి 18 వరకు జరిగిన ఈ కార్యక్రమాల ముగింపు వేడుక కామారెడ్డి RTC ప్రాంగణంలో జరిగింది. జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ మాట్లాడుతూ, డ్రైవర్లు అతి విశ్వాసానికి పోకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కె. మధుకర్ హెచ్చరించారు. డ్రైవర్ల అప్రమత్తతే ప్రాణరక్షణ అని ఆయన పేర్కొన్నారు.
RTC డిపో మేనేజర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, భద్రతా ప్రమాణాలలో రాజీ పడబోమని, ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన డ్రైవర్లకు సన్మానం చేశారు.












