వయోజన అక్షరాస్యత పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న “అమ్మకు అక్షరమాల ఉల్లాస్” కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన NIOS/FLNAT పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. మొత్తం 16,331 మంది అభ్యాసకులు నమోదు చేసుకోగా, అధిక సంఖ్యలో హాజరై పరీక్షలు రాశారు.
పరీక్షల నిర్వహణ కోసం 526 మంది DRDA-SERP సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. పరీక్షా కేంద్రాలలో నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, అభ్యాసకులకు అనుకూల వాతావరణాన్ని కల్పించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, అదనపు ప్రాజెక్ట్ అధికారి విజయలక్ష్మి, ఇతర అధికారులు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి, నిర్వహణ తీరును సమీక్షించారు. సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షించారు.
అధికారులు పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. వయోజనులలో అక్షరాస్యతను పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.











