కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అండగా నిలిచి, పెళ్లికూతురికి పుస్తె మట్టలను అందజేశారు.
సాయిలు-భూదేవి దంపతుల కుమార్తె సౌందర్య వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో, గ్రామస్తులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఆశ్రయించారు. వారి అభ్యర్థన మేరకు చంద్రశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి, గ్రామానికి చేరుకున్నారు.
పెళ్లికి అత్యంత ముఖ్యమైన పుస్తె మట్టలను ఆయన స్వయంగా వధువు సౌందర్యకు అందజేశారు. ఈ సహాయం ఆ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చింది. పేదింటి పెళ్లికి చేదోడు వాదోడుగా నిలవడం పట్ల గ్రామస్తులు చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన సేవా కార్యక్రమాలను గ్రామస్తులు ప్రశంసించారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం ఒక బాధ్యత అని, అందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జూలూరి సుధాకర్, నిమ్మ విజయకుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీ, సాయి బాబా, ప్రణీత్, అజీజ్, వార్డ్ సభ్యులు కోటి, బండారి శ్రీకాంత్, బల్ల శ్రీనివాస్, అరుణ్, పండు శ్రీకాంత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.












