సంగారెడ్డిలో దివ్యాంగుల సంక్షేమం, సాధికారత మరియు వారికి సమాన అవకాశాలను అందించడానికి సెర్ప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం ఆకార్–ఆశ వైద్యశాల సౌజన్యంతో పాత డీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించబడింది. పీడబ్ల్యూడీ డైరెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, దివ్యాంగుల హక్కుల పరిరక్షణలో సమాజంలోని ప్రతి వర్గం బాధ్యత వహించాలి అని చెప్పారు.
గ్రామ స్థాయిలో దివ్యాంగులను గుర్తించడం మరియు వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, వైద్య సేవలు, ఉపాధి అవకాశాలను అందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో దివ్యాంగుల అభివృద్ధికి సమాఖ్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అని తెలిపారు.
అకార్త్–ఆశ వైద్యశాల నిపుణులు శారీరక వైకల్యాల గుర్తింపు, వైద్య పరీక్షలు, చికిత్సా విధానాలు మరియు పునరావాస సేవలపై అవగాహన కల్పించారు.











