2026 ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్‌కు చెందిన కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించి, తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ విజయం విద్యార్థుల కృషికి, అధ్యాపకుల బోధనా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని సంస్థ చైర్పర్సన్ శ్రీమతి సి.హెచ్. విజయలక్ష్మి తెలిపారు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్, ఈఏపీసెట్ వంటి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఇప్పుడు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లోనూ సత్తా చాటడం గమనార్హం.
ఫలితాల ప్రకారం, హెచ్. భరత్ 1275, జె. తన్విత 1573, బి. సంధ్య 1627, ఆర్. బన్నీ 1834, మరియు ఎ. ఆత్రిజ్ 2361 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. ఈ ర్యాంకులు నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు మాత్రమే సాధించినవని యాజమాన్యం స్పష్టం చేసింది.
కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్, ఐఐటీయన్ సి.హెచ్. రామోజీరావు మాట్లాడుతూ, ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ, పోటీ పరీక్షలకు ప్రత్యేక బోధన అందించడం ద్వారా ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన వివరించారు.
వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విశిష్ట ఫలితాలు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ సి.హెచ్. తేజశ్విని అభినందించారు. ఈ విజయాలకు సహకరించిన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులందరికీ చైర్పర్సన్ శ్రీమతి సి.హెచ్. విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.












