కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రంజిత్ రెడ్డి, అనీమియా బాధితురాలికి పదవసారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ఈ సందర్భంగా ఆయన సేవలను ప్రశంసించారు.
కానిస్టేబుల్ రంజిత్ రెడ్డి, అనీమియా వ్యాధితో బాధపడుతున్న నసీమా బేగం అనే మహిళకు సకాలంలో ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసినట్లు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఇది ఆయన పదవ రక్తదానం కావడం విశేషం.
డాక్టర్ బాలు మాట్లాడుతూ, రంజిత్ రెడ్డి తన వృత్తితో పాటు సమాజ సేవలోనూ చురుగ్గా పాల్గొంటున్నారని, మూడు నెలలకోసారి ఆపదలో ఉన్నవారి కోసం రక్తదానం చేస్తూ పోలీసు శాఖకే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయన నిస్వార్థ సేవలు ఎంతో ప్రశంసనీయం.
వేసవికాలంలో రక్త నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో, మానవతా దృక్పథంతో మరిన్ని రక్తదానాలకు ముందుకు రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ప్రాణదాతగా నిలిచిన రంజిత్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు.
రక్తదానం చేయాలనుకునేవారు 9492874006 నంబర్ కు సంప్రదించి తమ వివరాలను తెలియజేయాలని, తద్వారా అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించవచ్చని డాక్టర్ బాలు సూచించారు.











