ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో సిఎస్ఐ చర్చ్ నుండి ప్రారంభమైన ఈ శాంతి ర్యాలీ, అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడంతో ముందుకు సాగింది. అంబేద్కర్ చౌరస్తా నుండి పెర్కిట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
ర్యాలీలో పాల్గొన్న వారు క్రీస్తు పునరుత్థాన శాంతి సందేశాన్ని చాటారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ జాన్ మాట్లాడుతూ, క్రీస్తు చూపిన శాంతి మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
ర్యాలీ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు, వందలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు.












