బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 49వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు.
ఆర్మూర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ ఆధ్వర్యంలో, స్థానిక కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 49వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పట్టణంలోని 36 వార్డులలో ఈ వేడుకలు విస్తృతంగా నిర్వహించారు.
జన్మదినోత్సవ సందర్భంగా, పార్టీ నాయకులు ఆర్మూర్ పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడు జీవన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తల మధ్య ఆయనపై ఉన్న అభిమానం ఈ సందర్భంగా స్పష్టంగా కనిపించింది.
ఈ జన్మదిన వేడుకలలో సీనియర్ నాయకులు పోల సుధాకర్, తహసిన్ (16వ వార్డు ఇంచార్జి), నదీమ్ (17వ వార్డు కౌన్సిలర్), ప్రవీణ్ గౌడ్, మట్టెల ప్రవీణ్, మట్టెల శ్రావణ్, బోడమీది నర్సయ్య, మాలిక్ బాబా, సెయింట్ పల్ బబ్లు, మోహన్ నాయక్, అంజాద్, ఎమ్మెనార్, డేవిడ్, చిట్టి నవీన్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని, మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.


