ఎల్లమ్మబండలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరుడు రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ శోభాయాత్రను, పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన చూపిన మార్గంలో యువత నడవాలని సూచించారు.
అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను, అందించిన రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ, ఆయన నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంఘం సభ్యులు, మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొని, అంబేద్కర్ పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు.










