ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన అభిమానుల ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీ కమ్యూనిటీ హాల్లో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక హాజరై, శిబిరాన్ని ప్రారంభించారు.
మంచు మనోజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు షేక్ సత్తార్, ఆర్కే చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో పలువురు యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను ప్రశంసించారు.
ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండి రమేష్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్, భారతీయ జనతా పార్టీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు, జనసేన పార్టీ ఇన్చార్జి మమ్మారెడ్డి ప్రేమ కుమార్, నటుడు భవాని చౌదరి వంటి ప్రముఖులు హాజరయ్యారు.
రక్తదానం ప్రాముఖ్యతను చాటి చెప్పడంతో పాటు, సమాజ సేవలో అభిమానుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని అందించారు.











