ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, విఆర్కే జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి, అనేకమంది విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులను, అధ్యాపకులను అభినందించింది.
నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో విఆర్కే జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. సెకండియర్ విద్యార్థులు అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా తమ ప్రతిభతో అదరగొట్టారు.
ఫలితాలలో ఏ నవోదయ బైపిసి సెకండియర్ విద్యార్థిని 994/1000 మార్కులు సాధించగా, పి మైథిలి ఎంపీసీ సెకండ్ ఇయర్ 993/1000, ఎం అనన్య సీఈసీ సెకండియర్ 982/1000, ఎం అఖిల ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ 987/1000 మార్కులు సాధించారు. వీరితో పాటు పలువురు విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించారు.
మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. నాష్ట్ర జమ ఎంపీసీ ఫస్టియర్ 466/470, శిరీష బైపీసీ ఫస్ట్ ఇయర్ 436/440, జోబియా తన్వీర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ 435/440, మదీనా సీఈసీ I Year 483/500 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.
ఈ అద్భుత ఫలితాలపై కళాశాల సీఈవో, కరస్పాండెంట్ డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన అధ్యాపకులకు, తల్లిదండ్రులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.












