పేద విద్యార్థులకు విద్యా హక్కు చట్టం (RTE) అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధనకై హైదరాబాద్‌లో ధర్నాకు పిలుపునిచ్చారు.
అక్షరాస్యత అర్హతను బట్టి అందరికీ అందాలని, విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్న కార్పొరేట్ సంస్థల దోపిడీని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ABCDలకే లక్షల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యా హక్కు చట్టం తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 25% ఉచిత సీట్లు పేద విద్యార్థుల జన్మహక్కు అని వారు నొక్కి చెబుతున్నారు.
తమ పిల్లల చదువుకు భరోసా కల్పించాలని, రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) అమలు కోసం పోరాడి, కార్పొరేట్ విద్యా సంస్థల ఆధిపత్యాన్ని అంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో, ఈ నెల 26న ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్‌లో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.











