కామారెడ్డి, 11/07/2026
శ్రీ సరస్వతీ విద్యాపీఠం - ఇందూర్ విభాగ్ స్థాయి ఆచార్య ప్రశిక్షణ వర్గాల సమారోప్ కార్యక్రమం కామారెడ్డిలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్లో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి శ్రీ మల్లికార్జున్ గారు, సరస్వతీ విద్యా మందిరాల ప్రాముఖ్యతను, విద్యార్థులకు అందించే విలువలను కొనియాడారు.
స్థానిక జిల్లా కేంద్రమైన శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హై స్కూల్, కామారెడ్డిలో రెండవ రోజు, అనగా 11/07/2026 శనివారం నాడు శ్రీ సరస్వతీ విద్యాపీఠం - ఇందూర్ విభాగ్ స్థాయి ఆచార్య ప్రశిక్షణ వర్గ సమారోప్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి జిల్లా విద్యాధికారి శ్రీ మల్లికార్జున్ గారు మాట్లాడుతూ, సరస్వతీ విద్యా మందిరాలు క్రమశిక్షణకు, సంస్కృతికి, ఆచార సంప్రదాయాలకు మారుపేరని కొనియాడారు. ఈ విద్యా మందిరాలలో విద్యతో పాటు సంస్కృతి, నైతిక విలువలు, దేశభక్తి, సత్ప్రవర్తన, నైపుణ్యాలు నేర్పుతారని తెలిపారు. ఇలాంటి శిక్షణా వర్గాలు ఆచార్యులకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా రెడ్డిగారి హరిస్మరన్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యాపీఠం నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా మనం కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గంగారెడ్డి గారు (పాఠశాల ఉపాధ్యక్షులు), శ్రీ రెడ్డిగారి హరీస్మరన్ రెడ్డి గారు (దక్షిణ మధ్య క్షేత్ర పూర్వ విద్యార్థి పరిషత్ సంయోజక్), శ్రీ గీరెడ్డి రాజిరెడ్డి గారు (కామారెడ్డి జిల్లా కార్యదర్శి), శ్రీ ప్రక్కీ శ్రీనివాస్ గారు (ఇందూర్ విభాగ్ శైక్షనిక్ సంయోజక్), శ్రీ శెట్టిపల్లి భాస్కర రావు గారు (రిటైర్డ్ ఎంఈఓ), శ్రీ నాగవేంద్ర గారు (జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్), పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నల్ల నాగభూషణం గారు, మరియు ఇందూర్ విభాగ్ స్థాయిలోని వివిధ పాఠశాలల ఆచార్యులు పాల్గొన్నారు.












