సంగారెడ్డి, 2026-08-05
సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి హైదరాబాద్ లో క్రీమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా అనుగ్యాన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారత అణుశక్తి రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి హైదరాబాద్ లో క్రీమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా అనుగ్యాన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యా, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
అణు ఇంజనీరింగ్, విద్యా నైపుణ్యాభివృద్ధి, స్వదేశీ సాంకేతిక సామర్థ్యాల పెంపు, స్వచ్ఛ ఇంధన రంగ అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. దీనిని మూడు నెలల రెసిడెన్షియల్ కార్యక్రమంగా రూపొందించారు. అనుగ్యాన్, ఐఐటి హైదరాబాద్ విద్యా నైపుణ్యాన్ని సమన్వయం చేస్తూ, విద్యా బోధన, పరిశ్రమల అవసరాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని తెలిపారు.
భారత అణుశక్తి రంగానికి అవసరమైన అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. రియాక్టర్ ఫిజిక్స్, థర్మల్ హైడ్రాలిక్స్, రేడియేషన్ షీల్డింగ్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, అణు భద్రత, క్వాలిటీ అష్యూరెన్స్, ఇంజనీరింగ్ డిజైన్, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డ్ నిబంధనల అనుసరణ, సిమ్యులేటర్ ఆధారిత శిక్షణ వంటి అంశాలను సమగ్రంగా బోధిస్తారు.
ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఉద్యోగంలో ఉన్న నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, సంస్థలు, పారిశ్రామిక పరికరాల తయారీదారులు భారత అణుశక్తి సరఫరా వ్యవస్థలో భాగస్వాములు కావడానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం పొందుతారు.
కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఐఐటి హైదరాబాద్, క్రిమిసన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నాయి. ఈ కార్యక్రమంలో ఐఐటి ప్రొఫెసర్లు, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.











