కామారెడ్డి జిల్లా పరిధిలోని గర్గుల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ఉచిత యూనిఫాం, షూస్ పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. చిన్నారుల విద్యాభివృద్ధి, పాఠశాల పట్ల ఆసక్తి పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
గ్రామ సర్పంచ్ దివ్య రవితేజ గౌడ్ విద్యార్థులకు యూనిఫాం, షూస్ అందజేశారు. ప్రాథమిక విద్య బలపడితేనే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో AAPC చైర్మన్ కలికోట సుజాత, మాజీ SMC చైర్మన్ ఆర్ నర్సింలు, ప్రధానోపాధ్యాయులు డి శంకర్, ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఏసుమని, ఉపాధ్యాయులు బాలకృష్ణ, సతీష్, మారుతి, అనూష లు పాల్గొన్నారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.












