కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బాలికలు, మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు షీ టీం, భరోసా సెంటర్ సంయుక్తంగా కాగజ్నగర్ జిల్లా పరిషత్తు సెకండరీ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు వివిధ భద్రతా అంశాలపై శిక్షణ ఇచ్చారు.
ఏఎస్ఐ సునీత మాట్లాడుతూ, విద్యార్థినులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టం, మహిళల భద్రతా చట్టాలు, ఆపదలో స్పందన, డయల్ 112 వినియోగం, సోషల్ మీడియా జాగ్రత్తలు, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థినులు తమ హక్కులను తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని, వేధింపులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు.
షీ టీం నంబర్ 8712670565, భరోసా సెంటర్ నంబర్ 8712670561 లకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, షీ టీం, భరోసా సభ్యులు పాల్గొన్నారు.











