కాచాపూర్ గ్రామంలో గ్రామదేవత ఊరడమ్మ గుడి పునర్నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మద్ది చంద్రకాంత్ రెడ్డి, అమ్మవారి గుడి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆయన పేర్కొన్నారు.
గుడి నిర్మాణానికి ముందుకు వచ్చిన మాజీ ఎంపిపి తొగరి బైండ్ల సుదర్శన్ ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ బైండ్ల తొగరి దశరథం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మాజీ పోలీస్ పటెల్ వతందారు కామినేని తిరుపతి రెడ్డి, మాజీ మాలీష్ పటేల్ వతందారు మోతె లావణ్య, మాజీ ఎంపిపి జాంగారి గాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గన్నమనేని నర్సింగరావు, బిఆర్ఎస్ అధ్యక్షులు అబ్బ బాలకిషన్, అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ పార్టీల పెద్దలు, నాయకులు, గ్రామ పెద్దలు, అన్ని కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పాల్గొన్న వారంతా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.











