అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ భవాని శివశంకర్ స్వామి వారి దేవాలయ ద్వితీయ పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ప్రేమ కుమార్ దేవాలయానికి విచ్చేసి, ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం, దేవాలయ కమిటీ సభ్యులు ప్రేమ కుమార్ను శాలువాతో సత్కరించి, గౌరవించారు. ఈ గౌరవం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణంతో వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు, పలువురు జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. వీరిలో మోహన్ రావు, ఈశ్వరరావు, గాంధీ, కృష్ణ, తంగం శ్రీనివాసరావు, బండారు ప్రసన్నాంజనేయులు, తుంగం రామారావు, పవన్, నీలకంఠం, కొల్లా శంకర్, పోలెబోయిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.











