కామారెడ్డి, 2026-07-03
కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అధ్యక్షతన CCTNS ద్వారా నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తు పనితీరును సమీక్షించిన ఎస్పీ, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. CCTNS 2.0లో ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అధ్యక్షతన CCTNS ద్వారా నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తు పనితీరును సమీక్షించిన ఎస్పీ, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి చట్టపరమైన గడువులోగా పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. CCTNS 2.0లో ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను నిర్దేశిత గడువులోగా పూర్తిగా నమోదు చేసి ఎలాంటి పెండెన్సీ లేకుండా ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.
జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో బస్సులు, అనుమానాస్పద వాహనాలు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్ వ్యవస్థను మరింత పటిష్టం చేసి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదలు, భారీ వర్షాల సమయంలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు అమలు చేయాలని ఎస్పీ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగంతో వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉన్న సిబ్బందికి అనుగుణంగా డ్యూటీ రోస్టర్ను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.











