కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన POCSO కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన ఆధారాలను తొలగించే ప్రయత్నంలో భాగంగా, మైనర్ బాధితురాలి మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంలో, హైదరాబాద్‌కు చెందిన ఒక యువ ఎథికల్ హ్యాకర్‌ను నిందితుడు సంప్రదించి, బాధితురాలి ఫోన్లోని డేటాను తొలగించాలని కోరినట్లు సమాచారం.
అయితే, ఇది తీవ్రమైన కేసుగా మారే అవకాశం ఉందని, తాను కూడా చట్టపరమైన చిక్కుల్లో పడతానని భావించిన ఆ యువ హ్యాకర్, ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం కలిగిన ఈ యువకుడు, ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ఈ ఆరోపణలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.











