నిజామాబాద్ పట్టణంలోని ముస్తైద్పుర ప్రాంతంలో గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో పట్టణంలో డ్రగ్స్ విక్రయాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం, ముస్తైద్పుర నివాసి షేక్ అబ్దుల్ ఖైజర్ తన ఇంట్లో గంజాయిని నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు SHO స్వప్న ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అతని ఇంటిపై దాడి నిర్వహించింది. ఈ దాడుల్లో షేక్ అబ్దుల్ ఖైజర్ వద్ద నుంచి 1.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం నిందితుడిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
గత కొంతకాలంగా నిజామాబాద్ నగరంలో గంజాయి విక్రయాలు పెరుగుతున్నాయని, యువత ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగించాలని కోరుతున్నారు.
ఈ ఆపరేషన్‌లో SHO స్వప్న, SI మల్లేష్, మరియు సిబ్బంది సునీల్, మోహన్‌సింగ్, ధరిసింగ్, రవి, షబ్బీర్, సంజయ్, ప్రభాకర్, సుచరిత పాల్గొన్నారు.

