నిజామాబాద్, 2026-08-05
సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., సూచించారు. జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., సూచించారు. జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్షా కా తిరంగా సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ
కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు అధికమవుతున్నాయని తెలిపారు.
మోసగాళ్ల ఎత్తుగడలు
100 శాతం లాభం, రోజువారీ ఆదాయం, ప్రత్యేక పెట్టుబడి అవకాశాలు, రహస్య సూచనలు వంటి తప్పుడు హామీలతో మోసగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని హెచ్చరించారు. నకిలీ ట్రేడింగ్ యాప్లు, వెబ్సైట్లు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా తొలుత నకిలీ లాభాలను చూపించి, అనంతరం మరిన్ని పెట్టుబడులు పెట్టించేలా ప్రలోభపెట్టి చివరకు వివిధ పేర్లతో అదనపు నగదు వసూలు చేస్తున్నారని వివరించారు. అలాగే నకిలీ ఆర్థిక సలహాదారులు, కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ చట్టబద్ధమైన అనుమతులు లేని సంస్థల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచనలు
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రతి పెట్టుబడి ప్రతిపాదనను నమ్మవద్దని, పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ లేదా బ్రోకర్ అధికారికంగా నమోదు అయి ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్, టెలిగ్రామ్ లేదా అపరిచితులు ఇచ్చే పెట్టుబడి సలహాలను విశ్వసించవద్దని, తొందరపెట్టే వారిని నమ్మరాదని చెప్పారు. పెట్టుబడి పెట్టే ముందు కుటుంబ సభ్యులు లేదా అర్హత కలిగిన ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.











