నిజామాబాద్, 2026-07-10
నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 80 క్వార్టర్స్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 65 వాహనాలను స్వాధీనం చేసుకుని, రూ.18 వేల విలువైన పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు.
నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 80 క్వార్టర్స్ ప్రాంతంలో ఏసీపీ, సబ్ డివిజనల్ అధికారులతో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి మొత్తం 52 మోటార్ సైకిళ్లు, 12 ఆటోలు, ఒక టాటా ఏస్ ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.18 వేల విలువైన పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ ప్రజలకు సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరస్థులను గుర్తించడం, నేరాల నియంత్రణలో కలిగే ప్రయోజనాలను వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది స్థానికులు పాల్గొన్నారు. ఈ వివరాలను 5వ టౌన్ ఎస్ఐ డి. సునీల్ వెల్లడించారు.












