సంగారెడ్డి, జూలై 31
సదాశివపేట పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు, ప్రత్యేక బోనాల ఊరేగింపులో పాల్గొని, సంఘం నాయకులచే సన్మానం అందుకున్నారు.
సదాశివపేట పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పోతురాజుల ఆట పాటలు, విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఇంటినుండి రెండు బోనాల చొప్పున 80 కుటుంబాలు అమ్మవారికి దాదాపుగా 100 కు పైచిలుకు బోనాలతో దుర్గమాతకు సమర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరై, ప్రత్యేక బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం నాయకులు పులిమామిడి రాజును శాలువాతో ఘనంగా సన్మానించి, ఆత్మీయ స్వాగతం పలికారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. మున్నూరు కాపు సంఘం సభ్యులందరూ ఐకమత్యంతో తొలిసారిగా బోనాల మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని దుర్గామాతను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ వైద్యం గోపి ప్రియాంక పవన్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సిద్దాపురం సత్యనారాయణ, గంట శివన్న, ప్రధాన కార్యదర్శి వెంకట్, కాసాల రాము, చీలం సురేష్, సుభాష్, ఖర్చర్ల హరీష్, నరేష్, రాగం అనిల్, వేణు, చెప్యాలా అనిల్, అలుగోల సతీష్, గోపాల్, గంట శ్రీనివాస్, శేఖర్, వెంకట్ తో పాటు సంఘం నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












