పటాన్చెరు, జూలై 30
లయన్స్ క్లబ్స్ అంతర్జాతీయ చైర్మన్ లయన్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా, లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురువారం పటాన్ చెరులోని లయన్స్ క్లబ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 200 మందికి భోజనం అందించారు.
లయన్స్ క్లబ్స్ అంతర్జాతీయ చైర్మన్ లయన్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్మింగ్ చైర్మన్ లయన్ అక్నాపురం లక్ష్మారెడ్డి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
గురువారం పటాన్ చెరు లయన్స్ క్లబ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 200 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి కార్యదర్శి, ముఖ్య అతిథి లయన్ పిల్లిగుండ్ల రాములుగౌడ్, ముఖ్య అతిథి రీజియన్ చైర్మన్ లయన్ జి.వెంకన్న, రీజియన్ సెక్రటరీ మంగళపర్తి వెంకటేశం, జిల్లా చైర్మన్ యన్. రామప్ప, లయన్ సభ్యులు పి.రామక్రిష్ణా రెడ్డి, జే. శ్రీధర్ రెడ్డి, యస్.క్రిష్ణ, జి.భరతయ్య తదితరులు హాజరయ్యారు.
ముఖ్య అతిథులు పి.రాములుగౌడ్, జి.వెంకన్న, మంగళపర్తి వెంకటేశంలు మాట్లాడుతూ ఆకలితో అలమటించే నిరుపేదలకు, ఆసుపత్రికి వచ్చే అనారోగ్యులకు ఆకలి తీర్చడమే తమ క్లబ్ ఆశయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.












